జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ
కుబీర్ (విజయ క్రాంతి): నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(Northern Power Distribution Company of Telangana Limited) నిర్మల్ సర్కిల్ పరిధిలో విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించి “జీరో యాక్సిడెంట్” లక్ష్యాన్ని సాధించే దిశగా సమగ్ర భద్రతా చర్యలు చేపడుతున్నామని సూపరింటెండింగ్ ఇంజనీర్ అల్జాపూర్ రమేష్(Superintending Engineer Aljapur Ramesh) తెలిపారు. వినియోగదారుల భద్రతతో పాటు సిబ్బంది రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఎర్తింగ్ వ్యవస్థలు, ఏబీ స్విచ్‌ల నిర్వహణలో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన సాంకేతిక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించడం కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం, సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు విద్యుత్ లైన్ల వద్ద మిడిల్ పోల్స్‌ను జనవరి నుంచి ఇప్పటివరకు 1005 Nos ఏర్పాటు చేశామన్నారు.
* సరైన ఎర్తింగ్ లేని ప్రాంతాలను 259 Nos ప్రాంతాల్లో గుర్తించి, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఎర్తింగ్ వ్యవస్థను సరిచేశారు.
* ఫీడర్లలో ఇండక్షన్ ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను 28 Nos చోట్ల గుర్తించి అవసరమైన సాంకేతిక చర్యల ద్వారా సమస్యను పరిష్కరించారు.
* రెండు వైపుల నుంచి విద్యుత్ సరఫరా జరిగే ప్రాంతాల్లో డేంజర్ బోర్డులను ఏర్పాటు చేసి, మరమ్మతులు, నిర్వహణ పనుల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టారు.
* ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏబీ స్విచ్‌లను ఏర్పాటు చేసి లోకల్ లైన్ క్లియర్ (LC) సదుపాయాన్ని కల్పిస్తున్నారు.