బొమ్మలరామారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు షాక్
16-09-2026 | 06:08pm
ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గం(Aleru Constituency) బొమ్మలరామారం మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింహులు, మండల అధ్యక్షుడు బూడిద శ్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
మల్యాల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు బిట్టు శ్రీనివాస్‌తో పాటు గణేష్, స్వామి, వెంకటేశం, ఆంజనేయులు, శ్రీనివాస్ తదితరులు పార్టీలో చేరారు. అలాగే మాంచినపల్లి, కేకే తండా, రామస్వామి తండాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.