బందారం పాఠశాలకు వాటర్ ప్యూరిఫయర్
విద్యార్థుల తాగునీటి కోసం 100 లీటర్ల ట్యాంక్, వాటర్ మిషన్ ఏర్పాటు
కొండపాక, (విజయక్రాంతి): కొండపాక మండలం బందారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ప్యూరిఫయర్(Water Purifier) మిషన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు దుద్దెడకు చెందిన పబ్బోజు రాజయ్యను కోరగా, స్పందించిన ఆయన 100 లీటర్ల వాటర్ ట్యాంక్‌తో పాటు వాటర్ ప్యూరిఫయర్ మిషన్‌ను అందించారు.
విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించిన పబ్బోజు రాజయ్యను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ రైతుబంధు సమితి అధ్యక్షుడు ర్యాగల్ల దుర్గయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు నీల సత్యం, సర్పంచ్ కొలుపుల గంగయ్య, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు రామచంద్రం, యూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజమణి, వార్డు సభ్యుడు మిట్టపల్లి రాజుతో పాటు గ్రామ నాయకులు పాల్గొన్నారు.