చేయూత దరఖాస్తుదారుల వివరాల పరిశీలన..
16-09-2026 | 07:35pm
బోథ్. సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న చేయూత పథకం(Cheyutha Scheme) తాలూకు దరఖాస్తుదారుల వివరాలను బుధవారం ఎంపీడీవో ఎల్ రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్ల వద్దకు వెళ్లి పూర్తి వివరాలను పరిశీలించడం జరిగింది. అంతేగాక వారి వివరాలను ఈ యాప్ లో నమోదు చేశారు. ఆయన వెంట పంచాయతీ ఈవో అశోక్ కుమార్ ఉన్నారు.