పోలీసుల చర్యలకు నిరసనగా బ్లాక్ డే

08-10-2026 | 10:59pm

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ఓటర్ల జాబితా సవరణ ఓట్ చోరీ విషయమై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), ఖర్గే లను అరెస్టు చేయడo హేయమైన చర్య అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah)  ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఓట్ల జాబితా సవరణ పేరుతో ఓట్లను తొలగించడం అంటే శరీరం నుండి ఆత్మను వేరు చేయడమేనని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.

ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల(Voter list revision election) ప్రక్రియలో పారదర్శకత అంశాలపై కాంగ్రెస్ పార్టీ, ఇండియా  కూటమి(INDIA alliance) నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.  ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత కర్గే, రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ తో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందిని

ఈ ఘటనకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు అక్టోబర్ 8వ తేదీని బ్లాక్ డేగా పాటిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించ డం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచంద్ర, పిఎసిఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, పట్టణ అధ్యక్షులు ముక్కెర్ల   మల్లేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు