విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడిన మాజీ కార్పొరేటర్

09-10-2026 | 05:34pm

 వి. సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రాపురం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను(Bathukamma Festival) పురస్కరించుకుని వి. గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(V. Geetha Bhupal Reddy Government Junior College) నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. సింధు ఆదర్శ్ రెడ్డి(V. Sindhu Adarsh ​​Reddy)  పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులతో కలిసి సింధు ఆదర్శ్ రెడ్డి బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యం చేస్తూ వేడుకల్లో సందడి చేశారు.

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, విద్యార్థినులు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ , కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి , అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు