ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..

17-09-2026 | 08:47pm

కొండపైన ప్రజా పాలన దినోత్సవ వేడుకలు...

నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం...

మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్...

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన దినోత్సవం(Praja Palana Day)లో పురస్కరించుకొని యాదగిరిగుట్ట మున్సిపాలిటీ(Yadagirigutta Municipality), గుట్ట దేవస్థానం, యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట పురపాలక కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొండపైన కార్యాలయం ప్రాంగణంలో ఈవో భవాని శంకర్ జండావిష్కరణ చేశారు.

మరిన్ని వార్తలు