పాల్వంచ త్రివేణి పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం

17-09-2026 | 09:39pm

పాల్వంచ,(విజయక్రాంతి): స్థానిక పట్టణంలోని దమ్మపేట సెంటర్‌లో గల త్రివేణి పాఠశాల(Triveni School)లో గురువారం వన మహోత్సవ(Vana Mahotsavam) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎనిమిదవసారి భద్రాద్రి రామన్న సన్నిధి నుండి తిరుపతి వెంకన్న సన్నిధి వరకు మహా పాదయాత్రను సంకల్పించి, లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

పాఠశాల డైరెక్టర్లు గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, సి.ఆర్.ఓ. కాట్రగడ్డ మురళీకృష్ణ, పాల్వంచ త్రివేణి పాఠశాల ప్రిన్సిపల్ ఈ. రామ్మూర్తి, కిడ్స్ ఇన్‌చార్జి కవిత, ఉపాధ్యాయులు,సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చెట్ల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, భవిష్యత్ తరాలకు వాటి అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, పరిసర ప్రాంత ప్రజలకు మొక్కల ప్రాధాన్యతను తెలియజేయాలని సూచించారు. “ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి, దానిని సంరక్షిద్దాం. భవిష్యత్ తరాలకు పచ్చని ప్రకృతిని అందిద్దాం” అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు