కొల్లూరులో మహా వైద్య శిబిరం..

03-10-2026 | 04:45pm

మెడిసిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య సేవలు..

ఆలేరు, అక్టోబర్ 3 (విజయక్రాంతి): కొల్లూరు గ్రామంలో(Kolluru Village) మెడిసిటీ హాస్పిటల్(Medicity Hospital) సహకారంతో శనివారం మహా వైద్య శిబిరాన్ని(Medical camp) నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జనగామ సుధారాణి శ్రీపాల్‌రెడ్డి(Village Sarpanch Janagama Sudharani Sripal Reddy), ఉపసర్పంచ్ గాజుల దశరథ్, గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిర నిర్వాహకులు గ్యాదపాక మల్లేష్, గాజుల వెంకటేష్ యాదవ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పీసీసీ జనరల్ సెక్రటరీ, పీఏసీఎస్ చైర్మన్ జనగామ ఉపేందర్‌రెడ్డి, ఆలేరు మున్సిపల్(Aleru Municipality) చైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పారునంది భాస్కర్, ఆలేరు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు, ఆలేరు చేనేత సంఘం అధ్యక్షులు దాసి శంకర్, ఆలేరు రెండో వార్డు కౌన్సిలర్ మార్క్, ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.

అలాగే షారజీపేట పీహెచ్‌సీ సీహెచ్‌ఓ సత్తమ్మ, ఆలేరు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గ్యాదపాక దీప, కొల్లూరు మాజీ సర్పంచ్ గాజుల నరసయ్య యాదవ్, పిల్లలమర్రి శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల ఆంజనేయులు యాదవ్, ఆలేరు రాఘవ సేవా సంస్థ అధ్యక్షులు మహేష్, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దారా బాలస్వామి, కొల్లూరు గ్రామపంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గ్యాదపాక సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు