పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోండి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ప్రారంభం
చుంచుపల్లి, అక్టోబర్ 03(విజయక్రాంతి) : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(Rajya Sabha Member Vaddiraju Ravichandra), మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao), జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి(Enugula Rakesh Reddy) సూచనల మేరకు నవంబర్ 1 2023 నాటికి ఏదైనా డిగ్రీ లేదా డిప్లమా(Degree or Diploma) పాసైన అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు(Graduate MLC vote) కోసం నమోదు చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉచిత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు సంకుబాపన అనుదీప్, వేముల ప్రసాద్ బాబు, కరాటే శ్రీను, కన్ని, అన్వర్, పూర్ణ, మనోజ్, ఈమంది గణేష్, శివ, మదాసు పద్మ, షరీఫ్, అంబుల వేణు గోపాల్, జున్నరు రాజేష్ గౌడ్, షణ్ముఖ, సోహెబ్, సచిన్, రాకేష్ రెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు.