సరిహద్దు మండల కేంద్రంలో ప్రకంపనలు

03-10-2026 | 05:42pm

కామారెడ్డి జిల్లా మద్నూరులో భూకంప ప్రకంపనాలు 

ఆందోళన చెందిన ప్రజలు

కామారెడ్డి,(విజయక్రాంతి): మహారాష్ట్రలోని ఇంగోలి తాలూకాలో శనివారం ఉదయం భూ ప్రకంపనాలు(Earthquake Tremors) ఏర్పడ్డాయి. పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లా(Kamareddy District) మద్నూర్ మండల కేంద్రంలో స్వల్పంగా భూకంప ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి (National Center for Seismology) వెల్లడించిన వివరాల ప్రకారం... ఉదయం 7:46 కు రిక్టర్ స్కేల్ పై3.3 మాగ్నే ట్యూడు  తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వెల్లడించారు. భూకంపకేంద్రం మహారాష్ట్రలోని  ఇగ్డోలి లో ఎవడు కిలోమీటర్ల లోతు లో ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రకంపనలు మహారాష్ట్రలోని నాందేడ్, దేగ్లూర్, బిలోలి ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల లో స్వల్ప భూకంప ప్రకంపనలు ఏర్పడినట్లు తెలిపారు. ఒకేసారి భూకంప ప్రకంపనలు స్వల్పంగా కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళన కు గురయ్యారు.

మరిన్ని వార్తలు