జాతీయ రహదారి పనులతో ట్రాఫిక్ ఇబ్బందులు..
క్షేత్రస్థాయిలో పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
చౌటుప్పల్, నవంబర్ 06: పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి నిర్మాణ పనుల కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యల(Traffic Issues)పై కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. రహదారి పనులతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులతో చర్చించారు.
వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మస్తాన్ బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, బొబ్బిళ్ల రాజేందర్, బత్తుల శ్రీహరి, సీతారామచంద్ర ఆలయ చైర్మన్ బొబ్బిలి మురళి, సర్పంచ్ జువ్వి నరసింహ, బొంగు జంగయ్య గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బాబా షరీఫ్, పస్తం గంగారాములు, జంగయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.