ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

06-11-2026 | 09:31pm

ఆదివారం  దీపావళి కి నిత్య కైంకర్యాలలో మార్పులు....

యాదగిరిగుట్ట, అక్టోబర్ 23 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy of Yadagirigutta) వారి దేవస్థానంలో నిత్య కైంకర్యాలు శాస్త్రోక్తంగా పండితులు నిర్వహించారు. శుక్రవారం శ్రీ స్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు.

అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు.... ఆలయ నిత్య కైంకర్యాలలో   మార్పులు...... యాదగిరిగుట్ట దేవస్థానము(Yadagirigutta Temple)(వైటిడి)  ఆశ్వీయుజ బహుళ చతుర్థశి  ఆదివారం న దీపావళీ పర్వదినం సందర్భముగా శ్రీ స్వామి వారి ఆలయం నందు ఉదయం నిత్య కైంకర్య సమయ వేళలు మార్పులు చేయడం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు.

ఉదయం 3-30 నుండి 4-00 ల వరకు సుప్రభాతము

4-00 నుండి 4-45వరకు శ్రీస్వామి వారికి ఆస్థాన మంగళ హారతులు,4-45  నుండి 5-45 వరకు శ్రీస్వామి వారికి తిరువారాధన, బాలభోగము, ఆరగింపు.5-45 నుండి 6-45 వరకు నిజాభిషేకము,6-45  నుండి 7-15 వరకు సహస్రనామార్చన 7-15 నుండి ఉభయ దర్శనములు, సుదర్శన నారసింహ హవనము, కళ్యాణము ఆలయ కార్యక్రమములు యదావిధిగా నిర్వహించబడునని తెలిపారు.  శ్రీ స్వామి సుప్రభాత దర్శనం టికెట్లు రద్దు చేయడం జరిగిందని తెలిపారు.

మరిన్ని వార్తలు