టాలెంట్ టెస్ట్ బహుమతుల ప్రధానోత్సవం

01-11-2026 | 04:45pm

బోథ్. నవంబర్ 1 (విజయక్రాంతి): ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగత్ సింగ్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ఆదివారం అందించారు. స్థానిక ఎస్సై పురుషోత్తం(SI Purushottam), సర్పంచ్ అన్నపూర్ణ ఉప సర్పంచ్ విజయలక్ష్మి సిపిఐ జిల్లా కన్వీనర్ విలాస్ ల చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న తెలివితేటలను బయటకు తీసుకువచ్చేందుకు నిర్వహించిన కార్యక్రమం బాగుందని అభినందించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మున్సిఫ్, తో పాటు సిపిఐ నాయకులు గోదావరి, గోవర్ధన్ల తో పాటు వాడు సభ్యులు శాకీర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్, ప్రేమ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు