ఆదివాసి గూడాలలో భోగి పూజలు

02-11-2026 | 04:26pm

ఉట్నూర్, నవంబర్02 ( విజయక్రాంతి ): ఉట్నూర్ ఏజెన్సీ(Utnoor Agency) ప్రాంతంలోని  ఆదివాసి గూడాలలో  సోమవారం ఉదయం  ప్రతి ఇంటిని శుభ్రం చేసుకుని  దండారి ఉత్సవాలకు(Dandari festival)  భోగి పూజలు చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని  మల్లాపూర్ గ్రామంలో గ్రామ పటేల్ దుర్వ రాజు  ఎత్మాసూర్ దేవుడ్ని  ఇంటి ఆవరణ ముందు  ఉంచి , నెమలి ఈకల  టోపీ తో పాటు  దేవత సామాగ్రి కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రతి ఇంటి నుండి  మహిళలు పూజా సామాగ్రి తో  ఎత్మాసూర్  దేవత వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

ఇంద్రవెల్లి మండలంలోని  దేవాపూర్ గ్రామం తో పాటు  ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని  ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, సిరికొండ, అదిలాబాద్ రూరల్ మండలం తో పాటు  పళ్ళు గిరిజన గ్రామాల్లో  దండారి ఉత్సవాల ప్రారంభానికి భోగి పూజలు నిర్వహించారు. భోగి పూజల అనంతరం   సహా పంక్తి  భోజనాలు చేశారు..

మరిన్ని వార్తలు