శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం

02-11-2026 | 04:51pm

సుల్తానాబాద్ , నవంబర్ 02  (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ(Sri Abhayanjaneya Swamy Temple) పునర్నిర్మాణ కార్యక్రమానికి తమ వంతు సహకారంగా సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్‌కు చెందిన అల్లం భాగ్యలక్ష్మి  సత్యనారాయణదంపతులు రూ.20,000 (ఇరవై వేల రూపాయలు) విరాళంగా సోమవారం అందించి తమ భక్తి, దాతృత్వహృదయాన్ని చాటుకున్నారు.

దేవాలయ పునర్నిర్మాణం గురించి వారి నివాసంలో కలిసి వివరించగా, ఆలయ నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి  విరాళం అందించడం ఎంతో అభినందనీయం, ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుమ్మ రాజ్ కుమార్,  కొల్లూరి సంతోష్ కుమార్, కరెంగుల హరీష్, కరెంగుల అజయ్, కోడి సాయి కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు,

మరిన్ని వార్తలు