మహిళల ఆర్థిక అభివృద్ధికి సహకరించండి
22-09-2026 | 08:24pm
బోథ్ సెప్టెంబర్ 22 ( విజయక్రాంతి) మహిళల ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘాల వారు సీసీలు సహకరించాలని డిపిఎం సాయిప్రసాద్(DPM Sai Prasad) కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి కార్యాలయంలో అన్ని గ్రామాల మహిళసంఘాల వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు చిన్నచిన్న పరిశ్రమలను ఎంటర్ప్రైజెస్ లను ప్రోత్సహించాలన్నారు. ఎంటర్ప్రైజెస్ లకు రెండు లక్షల రూపాయల మేరకు రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అయితే బ్యాంకు టర్నోవర్ ఆధారంగా నిధులు మంజీరవుతాయన్నారు. సమావేశంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలతో పాటు ఏపీఎం గణేష్ సీసీలు మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.