కొమురవెల్లి మల్లన్న ఆలయంలో అన్నదాన వితరణ
22-09-2026 | 08:35pm
కొమురవెల్లి (విజయక్రాంతి): కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం(Komaravelli Mallikarjuna Swamy Temple)లో నిర్వహిస్తున్నటువంటి మహాగణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు స్థానికులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా పూర్తవడానికి సహకరించిన సిబ్బందికి, భక్తులకు స్థానికులకు, కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బుధవారం రోజు గణపతి నిమజ్ఞన కార్యక్రమం ఉన్నందున దేవస్థాన సిబ్బంది, భక్తులు, స్థానికులు భక్తిశ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.