జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ఫరాన్కు ప్రథమ స్థానం
27-10-2026 | 07:46pm
బేల అక్టోబర్ 27(విజయక్రాంతీ): బేల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి MD ఫరాన్ జిల్లా స్థాయి PM SHRI పాఠశాలల సైన్స్ ఎగ్జిబిషన్లో(Science Exhibition at PM SHRI Schools) ప్రథమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థి ఫరాన్ను, ఆయనకు మార్గదర్శకత్వం అందించిన ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందించింది.