ప్రజల వద్దకే ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారానికి చొరవ

27-10-2026 | 08:05pm

బెజ్జంకి, అక్టోబర్ 27: మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Dr Kavvampally Satyanarayana) ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా రేగులపల్లి, చిల్లాపూర్ గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, ఇతర సమస్యలపై అధికారులతో సమీక్షించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఒగ్గు దామోదర్‌, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, మాతంగి అనిల్‌, వైస్‌ చైర్మన్‌ పర్శ సంతోష్‌, సర్పంచులు జంగిలి లక్ష్మి, తిరుపతి, స్వరూప, భాస్కరాచారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు