ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

27-10-2026 | 08:02pm

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ, అక్టోబర్ 27 (విజయ క్రాంతి):ప్రజావాణి కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి(Collector Chahat Bajpai) ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎక్సైజ్ శాఖ అధికారులతో వారి కార్యకలాపాల పైన కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు, జిల్లాలో అక్రమ మద్యంపై ఇప్పటి వరకూ నమోదు చేసిన కేసులు, బెల్ట్ షాపుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎక్సైజ్ శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన 27 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు.ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ  సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, ట్రైనీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నీలోఫర్ అజ్మీ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు