ఆత్మహత్యల పాల్పడ్డ రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

02-11-2026 | 08:32pm

బోథ్. నవంబర్ 2 (విజయక్రాంతి): మండలంలోని దన్నూరు గ్రామానికి(Dannuru Village) చెందిన సంద పూజా రెడ్డి బద్దం రాజేశ్వర్ రెడ్డి అనే రైతులు గత వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎల్ నినోప్రభావం(impact of El Niño) వల్ల రైతులు సాగుచేసిన పంటల దిగుబడి రాకపోవడంతో పంట భూమిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడ్డారని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సాంగెపు బోర్రన్న పేర్కొన్నారు.

రైతు కుటుంబాల వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం గమనించి అధ్యయనం చేస్తూ ఆర్థిక పరిస్థితులపై తెలుసుకోవడం జరిగింది. గత ఏడాది భారీ వర్షాలు ఈ ఏడాది అత్యల్ప వర్షాలతో రైతుల నష్టపోయారన్నారు. ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ ఒక వంద 94 ఆధారంగా ఆరు లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చి వారి కుటుంబాల లో భరోసా నింపాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వినయ్ రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు