రోడ్డుపై న్యూసెన్స్.. ఐదుగురిపై పెట్టీ కేసులు

02-11-2026 | 09:25pm

మేడిపల్లి,(విజయక్రాంతి): మద్యం సేవించి రోడ్డుపై న్యూసెన్స్‌కు పాల్పడిన ఐదుగురిపై పెట్టీ కేసు నమోదు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అక్టోబర్ 31వ తేదీ రాత్రి డి. అంబదాస్ (38), బి. శ్రీకాంత్ (29), మేకల మహేష్ (30), కె. లక్ష్మణ్ (34), ఎం. చిరంజీవి (42) చెంగిచెర్ల ఎక్స్‌రోడ్డు సమీపంలోని శ్రీనివాస్ వైన్స్ వద్ద మద్యం సేవించి రోడ్డుపై న్యూసెన్స్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్లు సీఐ డి.జలేందర్ రెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు