గ్రామ సంఘం భవన నిర్మాణానికి శ్రీకారం

24-10-2026 | 03:25pm

రామారెడ్డి,(విజయక్రాంతి): రామారెడ్డి మండలం(Ramareddy mandal) ఉప్పల్‌వాయి గ్రామంలో శనివారం గ్రామ సంఘం భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్ రావు, ఏఈ పీఆర్ సురేష్(AE PR Suresh) పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సంఘాలకు అవసరమైన వసతుల కల్పనలో భాగంగా గ్రామ సంఘం భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ అబ్బ లింగం, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ సంఘం అధ్యక్షురాలు అజ్మిరి బేగం, వీఓఏ అనసూయ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు