ఎస్సీ వర్గీకరణతో మాల ఉప కులాల కు అన్యాయం...

11-10-2026 | 10:00pm

మాల సంఘాల JAC రాష్ట్ర చైర్మన్ డాక్టర్ భాస్కర్...

ఆదిలాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : SC వర్గీకరణలో గ్రూపు-III లో మాలలు మాల ఉప కులాల కు చాలా అన్యాయం జరిగిందని మాల సంఘాల JAC రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్(Dr. Mandal Bhaskar, State Chairman of Mala Associations JAC) అన్నారు. ఆదివారం జిల్లా మాల సంక్షేమ సంఘ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్  విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మాలల కంటే ఎంతో అభివృద్ధి లో ముందున్న వర్గాలకు రోస్టర్ పాయింట్ లలో ముందు వరుసలో చేర్చడం ఆర్టికల్ 15, 16 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు SC లను వర్గీకరణ చేయాలని ఎక్కడ చెప్పలేదని తెలిపారు. SC ఉప కులాలలో ఎవరు ఎంత అభివృద్ధి చెందారో మొత్తం ఎంపరీకల్ డాటా పరిశీలించిన తర్వాత వెనుకబడిన వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించి వారిని మిగిలిన వారితో సమానంగా అభివృద్ధి చెందేలా అవకాశాలు కల్పించాలని సూచించింది.  మాలల చైతన్య సభలు ఆదిలాబాద్ నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల సంఘం OU JAC అధ్యక్షులు మాదాసు రాహుల్, OU JAC నాయకులు  పండుగ భానుతేజ, దత్తన్న, జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొచ్చన్న, ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు అసోసియేట్ అధ్యక్షులు పాశం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు