ప్రతి ఏటా ఆకర్షణగా నిలుస్తున్న వేదం పాఠశాల కూచిపూడి నాట్యం

09-10-2026 | 12:33pm

బోథ్,(విజయక్రాంతి): ప్రతి ఏడాది మండల కేంద్రంలో దుర్గ నవరాత్రి ఉత్సవాలు(Durga Navaratri Celebrations) ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే వివిధ రకాల ఆటపాటలతో భక్తులను ఆలరింపజేసే కార్యక్రమాలు దుర్గా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడంతో మండల కేంద్రంలోని దుర్గాదేవి ఉత్సవాలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి భారీగా ప్రజలు వస్తుంటారు. అయితే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు కూచిపూడి నాట్యం ప్రదర్శన ఆకర్షణగా ఉంటుంది.

  • సెలవుల సమయాల్లో పాఠశాల యాజమాన్యం వారు ఆసక్తి ఉన్న విద్యార్థుల కు కూచిపూడి నాట్యం(Kuchipudi Dance) నేర్పిస్తున్నారు. అయితే నాట్యం నేర్చుకున్న విద్యార్థినులు ప్రదర్శించే కూచిపూడి నాట్యం చూసేందుకు బస్సులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ ఏడాది సహితం దుర్గా నవరాత్రి వేడుకలలో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించేందుకు విద్యార్థినులు సిద్ధమవుతున్నారు. ఇది ఏమైనా కూచిపూడి నాట్య కళాబృందం ప్రదర్శించే నాట్యం ఆకర్షించనుంది.

మరిన్ని వార్తలు