నవలా చక్రవర్తి ‘ముదిగొండ’ కన్నుమూత

09-10-2026 | 05:10am

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ప్రముఖ చారిత్రక నవలా రచయిత, జ్యేష్ఠ కార్యకర్త ముదిగొండ శివప్రసాద్(Mudigonda Sivaprasad)(82) గురువారం రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. శివప్రసాద్ తన రచనల ద్వారా తెలుగు పాఠకులపై చెరగని ముద్ర వేశారు. వసంత గౌతమి & నాగానీక, శ్రావణి, అవాహన & చంద్రకళ, నాగపూర్ణిమ తదితర రచనలు ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. సాహిత్యంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.

ఆయనను అభిమానులు ‘చారిత్రక నవలా చక్రవర్తి’గా పిలుచుకునేవారు. శివప్రసాద్ మృతితో తెలుగు సాహితీ లోకం ఓ విశిష్ట రచయితను కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సాహితీవేత్తలు, అభిమానులు సంతాపం వ్యక్తంచేశారు. అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ శివం రోడ్డులోని ఆయన నివాసం వద్ద జరుగుతాయని కుమారుడు ముదిగొండ ఇందుశేఖర్ (9908221589) తెలిపారు. 


మరిన్ని వార్తలు