దసరా ర్యాలీలో తల్వార్తో సంచారం.. వ్యక్తి అరెస్ట్
25-10-2026 | 04:23pm
ఇచ్చోడ, విజయక్రాంతి అక్టోబర్ 25: దసరా పండుగ ర్యాలీ(Dasara Rally)లో తల్వార్తో సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించిన వ్యక్తిపై ఇచ్చోడ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇచ్చోడ మండలం ధాబా-బి గ్రామానికి చెందిన టేకులే గణపతి (23) ఈ నెల 20న తల్వార్తో ర్యాలీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 492/2026, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 27(1) ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు ఎస్హెచ్ఓ వి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయుధాలతో సంచరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.