రైతులకు మెరుగైన సేవలు అందించాలి

25-10-2026 | 05:00pm

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయండి

మానకొండూరు, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రైతుల సంక్షేమం(Welfare of Farmers) కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) కొత్త పాలకవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలని, రైతులకు(Farmers') మెరుగైన సేవలు అందించాలని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ(Dr. Satyanarayana) మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. 

మానకొండూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో(Market Yard) ఆదివారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైర్మన్ గా రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ గా రేమిడి శ్రీనివాస్ రెడ్డితోపాటు నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన పాలకవర్గం రైతుల సంక్షేమం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీని సమర్థవంతంగా నిర్వహించి, రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. 

గత సంవత్సర మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఒక బీసీ బిడ్డకు ఇవ్వగా, ఈసారి ఎస్టీ బిడ్డకు అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు తప్పక వస్తాయని అని చెప్పారు.

నూతన చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఏఎంసి చైర్మన్ గా రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ గా రేమిడి శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్లు గా ఎర్రాల కవిత, తమ్మిశెట్టి రాజేశ్, రామినేని రమణ, కనకం అశోక్, రేపాక రాజేశ్వర్, కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మందల సంపత్ రెడ్డి, ముక్కెర సతీష్ కుమార్, ఆరవేణి రామాంజయ్య, దూలం వీరస్వామి, విశ్వనాథుల వీర కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కె.విజయ్ కుమార్,  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్లు నాగిశెట్టి రాజయ్య(మానకొండూర్),  ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి (ఊటూరు), గంగుల రామ్ రెడ్డి, రెడ్డి(గట్టుదుద్దెనపల్లి), రొంటాల లక్ష్మారెడ్డి(దేవంపల్లి), కీసర సంపత్ (తాడికల్), ఊట్కూరి వెంకటరమణారెడ్డి (ఇల్లంతకుంట), ఒగ్గు దామోదర్ (బెజ్జంకి), ఏఎంసి చైర్మన్లు మాతంగి శిరీష అనిల్, అంతగిరి సాహిత్య వినయ్ కుమార్, సర్పంచుల ఫోరం మండల చైర్మన్ పెంచాల కిషన్ రావ్, సర్పంచులు, పార్టీ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

భారీ ర్యాలీ

ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు  అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే , ఏఎంసీ చైర్మన్, చైర్మన్లు  పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి గడి, పల్లె చౌరస్తా మీదుగా మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఏకరూప దుస్తుల్లో మహిళల డప్పు  చప్పుళ్ళుతో ముందుకు సాగారు. చౌరస్తాల వద్ద పటాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు