బీరంగూడలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

25-10-2026 | 04:53pm

కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, నరసింహ గౌడ్ నివాసంలో ఆత్మీయ విందు

పటాన్ చెరు/అమీన్‌పూర్, అక్టోబర్ 25: బీరంగూడలో(Beeranguda) ఆదివారం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) శాసనసభా పక్ష నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(Tanniru Harish Rao) పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించి, మహా రుద్రాభిషేకం, పుష్పార్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వాగతం పలికారు.

అనంతరం అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాణిక్ యాదవ్, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు