గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

25-10-2026 | 04:51pm

దామరచర్ల : అక్టోబర్ 25 : రోడ్డు ప్రమాదంలో(Road accident) గాయపడి మిర్యాలగూడ పట్టణంలోని లీలా హాస్పిటల్‌లో(Leela Hospital) చికిత్స పొందుతున్న దామరచర్ల మండలం బెట్టె తండాకు చెందిన అజ్మీరా వాల్య(Ajmera Value) ను ఆదివారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గూర్చి వైద్యులను(Doctors') అడిగి తెలుసుకున్నారు.ఆయన కు మెరుగైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగు నాయక్ , గాజుల శ్రీను ,బంటు కిరణ్ ,స్కైలాబ్ నాయక్ ,సైదానాయక్ తదితరులు  పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు