విద్యుత్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి

22-09-2026 | 06:31pm

బేల సెప్టెంబర్ 22(విజయక్రాంతి): మండలంలోని పాఠన్ గ్రామానికి చెందిన అబ్దుల్ జావిద్ (40) మేకల కోసం తీగలు కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు(Electrical transformer) సంబంధించిన తీగలు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించినట్లు ఎస్‌ఐ మధుకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు