ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం
నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 22 (విజయక్రాంతి):సెప్టెంబర్ 23న 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం(National Ayurveda Day) సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలోని ఆయుష్ ఆరోగ్య మందిర్లో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా వయోవృద్ధులుకి మెడికల్ క్యాంపు,అంగన్వాడి కేంద్ర లో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేద ఆధారిత పోషణ గురించి అవగాహన సదస్సు,పిమ్ జడ్పీహెచ్ఎస్ స్కూలులో యోగ మెడిటేషన్ సెషన్స్, పిహెచ్సి ప్రాంగణంలో ఆయుర్వేద వాక్ నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ దీప ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ...ఈ సంవత్సరం 11 వ ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్నాం అని, ప్రతి సంవత్సరం 23వ తేదీన ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటారని చెప్పారు.
సెప్టెంబర్ 23కి ఒక ప్రత్యేకత ఉందని,పగలు రాత్రి సమానంగా ఉంటాయని,అదే సమతుల్యత ఆయుర్వేద చికిత్స ఆధారపడి ఉంటుంది.కాబట్టి ఆయుర్వేద దినోత్సవం జరపాలని 2025 న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.2016 నుంచి ఆయుర్వేద దినోత్సవం జరపడం మొదలు పెట్టారు.
అపుడు ధన త్రయోదశి రోజున ధన్వంతరి జయంతినే ఆయుర్వేద దినోత్సవం జరపడం జరిగింది.కానీ ప్రతి సంవత్సరం తేదీల ప్రకారం తేదీ మారుతుందని ఆయుర్వేదంకి అంతర్జాతీయ గుర్తింపు తేవాలని 2025 సెప్టెంబర్ 23న ఒక స్థిరమైన రోజుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ సంవత్సరం ఆయుర్వేద దినోత్సవం థీమ్ ఆరోగ్య కరమైన రేపటి కోసం ఆయుర్వేదం అని డాక్టర్ దీప తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయూష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీప, ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్,యోగ ఇన్స్పెక్టర్ లావణ్య,సిబ్బంది పాల్గొన్నారు.