వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన
మహా ముత్తారం సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మండలంలోని బోర్ల గూడెం గ్రామంలో రైతులకు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం, ఎల్‌నినో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు మంగళవారం శిక్షణ, అవగాహన కార్యక్రమం(Awareness Program) నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలైన పప్పు దినుసులు, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర పంటలను సాగు చేయాలని సూచించారు.. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి.అనూష, ఉద్యాన శాఖ అధికారి మణి, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆర్ శివకృష్ణ, ఆర్. శశివర్ధన్, ఆర.ప్రవళిక, రైతులు తదితరులు పాల్గొన్నారు.