యువతే దేశ భవిష్యత్‌: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

24-10-2026 | 06:39pm

ఉట్నూర్, అక్టోబర్ 24( విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువతకు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు..

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. యువత మత్తు వ్యసనాలకు దూరంగా ఉండాలి,దురలవాటులతో యువకులు జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు.ఉన్నత లక్ష్యంతో కష్టపడి ఎదిగి తల్లి తండ్రులకు అండగా నిలుస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారధ్యంలో గంజాయ్,డ్రగ్స్ అరికట్టేందుకు ఈగల్ అనే ప్రత్యేక బృందం పని చేస్తుందని గుర్తు చేశారు.

యువత మంచి మార్గంలో నడిపిస్తూ మంచి భవిష్యత్ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్మన్నారు. యువతకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు.కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే  ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు,మరియు సామాజిక కార్యకర్త ముంతాజ్,కాంగ్రెస్ నాయకులు అన్సారీ, ఫహీమ్,పెద్దలు,యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు