విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

29-10-2026 | 09:17pm

బోథ్,(విజయక్రాంతి): విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadav Anil) పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో(Telangana Model School) నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల(Freshers' Day celebrations)కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యేను విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. చదువులతోపాటు క్రీడల్లో అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు.

పాఠశాలలో నెలకొన్న సమస్యలను 9వ తరగతి విద్యార్థినిలు ఎమ్మెల్యే పత్రం ద్వారా అందించారు. పాఠశాలలో విద్యార్థులు ఆడుకునేందుకు ఆటస్థలం ఏర్పాటుకు హామీ ఇచ్చారువిద్యార్థుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తాను ముందు ఉంటానని పేర్కొన్నారు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు.

మోడల్ స్కూళ్లను ప్రైమరీ మోడల్ స్కూల్ గా మార్చాలని రెండు రోజుల క్రితమే విద్యాశాఖ కార్యదర్శి కలవడం జరిగిందని త్వరలో ప్రైమరీ మోడల్ స్కూల్ గా మార్చి విద్యార్థులకు విద్యా సేవలందిస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు రాజు రెడ్డి ,రూప్ చంద్ ,సంజయ్, బాబులాల్, నాయకులు ఎలుకరాజు పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్ యువత అధ్యక్షులు ప్రవీణ్, నాయకులు రాకేష్ రెడ్డి ,సంజీవ్, రమణ గౌడ్, గంగమల్లు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు