దుర్గాదేవిని దర్శించుకున్న ఎంపీ.. సన్మానించిన గ్రామస్తులు
19-10-2026 | 06:38pm
బోథ్ అక్టోబర్ 19 (విజయక్రాంతి): సోనాల మండలంలోని ఘన్పూర్ గ్రామంలో ప్రతిష్టాపించిన దుర్గామాత మండపాన్ని ఆదిలాబాద్ ఎంపీ జీ నగేష్(MP G Nagesh) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీని గ్రామ సర్పంచ్ తో పాటు మహిళలు స్వాగతించి సన్మానించారు. ఇదే రోజు ఎంపీ జన్మదినం కావడంతో గ్రామానికి వచ్చిన ఎంపీని గ్రామస్తులు సన్మానించి జీవించారు. కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.