కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
ముకరంపుర, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేతుల మీదుగా జరగనున్న కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం(Karimnagar District New Collectorate Building) ఈనెల 30న ప్రారంభోత్సవ సిద్ధమైంది. కార్యక్రమ నిర్వహణలో చిన్నపాటి లోపానికి కూడా తావులేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. శుక్రవారం రాత్రి నూతన కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(District Collector Chitra Mishra) క్షుణ్ణంగా పరిశీలించారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని అత్యంత సుందరంగా అలంకరించి ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో ప్రోటొకాల్ ను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. వారికి స్వాగతం పలకడంతో పాటు కార్యక్రమం పూర్తయ్యే వరకు సమన్వయం చేసేందుకు లైజనింగ్ అధికారులను ఏర్పాటు చేయాలని అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని తెలిపారు.కలెక్టరేట్ ప్రారంభోత్సవం తో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కూడా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
వేదిక, ప్రెస్ గ్యాలరీ, అతిథులు, ప్రజలు, మీడియాకు అవసరమైన ఇతర సదుపాయాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం నిర్వహణలో చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల, ఏవో సుధాకర్, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.