లక్కీ డ్రాలో విజేతగా సీఎం రేవంత్‌రెడ్డి పేరు

25-09-2026 | 10:49pm

రూ.25 వేల నగదు బహుమతిని కమిటీకే అందించిన సాయికుమార్

సూర్యాపేట, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో కాసం మణి యూత్(Kasam Mani Youth) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద శుక్రవారం నిర్వహించిన లక్కీ డ్రాలో(Lucky Draw) సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పేరు విజేతగా రావడం ఆసక్తికరంగా మారింది. తోనుకునూరు సాయికుమార్(Thonukunuru Saikumar) లక్కీ డ్రా కోసం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పేరుతో చీటీ రాయగా, అదే చీటీ విజేతగా ఎంపికైంది. కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా బహుమతులుగా రూ.25 వేల నగదు, 15 కిలోల లడ్డును ఏర్పాటు చేశారు.

అయితే సీఎం రేవంత్‌రెడ్డి పేరు చీటీ విజేతగా రావడంతో సాయికుమార్‌కు రూ.25 వేల నగదు బహుమతి లభించింది. ఆ నగదును తాను స్వీకరించకుండా కమిటీ సభ్యులకు తిరిగి అందజేశారు. కేవలం 15 కిలోల లడ్డును మాత్రం స్వీకరించారు.సీఎం రేవంత్‌రెడ్డి పేరుతో రాసిన చీటీ విజేతగా ఎంపిక కావడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగదు బహుమతిని తిరిగి అందించిన సాయికుమార్‌ను కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాసం మణి యూత్ కమిటీ సభ్యులు కాసం మణి, రామ్‌సాయి, ఎస్. మధు, మామిడి ప్రవీణ్, నారగోని రోహిత్, కాసం విష్ణు, పెండాల ప్రణయ్, గుండగాని శివ, గునగంటి యోగి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు