ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే లక్ష్యంగా 9వ పోషణ మాసోత్సవాలు!
23-09-2026 | 06:05pm
తాంసి/భీంపూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార లోపాన్ని నివారించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకే 9వ పోషణ మాసోత్సవాలు అని ఐసిడీఎస్ సూపర్వైజర్ రాధ(ICDS Supervisor Radha) అన్నారు. బుధవారం భీంపూర్ మండలం పిప్పల్ కోటి అంగన్వాడీ-3లో 9వ పోషణ మాసం ఘనంగా నిర్వహించారు. రాగి, ఆకుకూరలు, స్థానిక పోషకాహార వంటకాల ప్రదర్శనలు చేసి అవగాహన కల్పించారు. చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపం, రక్తహీనత నివారణ, గర్భిణులు, బాలింతల్లో సరైన పోషకాహార అవగాహన కల్పించడమే లక్ష్యం అని సూపర్ వైజర్ రాధ అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వెంకటమ్మ, ఏఎన్ఎం సుశీల, సుజాత, లక్ష్మి,సునంద,తదితరులు పాల్గొన్నారు.