గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
చిట్యాల,(విజయ క్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని పరిసర గ్రామాల గణేష్ విగ్రహాల నిమజ్జనం(ganesh immersion) కోసం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి వెంట ఉన్న చెరువును జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్(Collector B. Chandrasekhar) బుధవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
భద్రతా చర్యలు, పారిశుధ్యం, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించాలని సూచించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో జె. పాండు, ఎంపీవో ఎ. కోటేష్, డిప్యూటీ తహసీల్దార్ బి. విజయ, పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ బి. రామకృష్ణ, ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, ఆర్‌ఐ అమర్నాథ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, పెద్దకాపర్తి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.