వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఇంట్లో స్నానానికి వేడి నీళ్ళ కోసం విద్యుత్ వాటర్ హీటర్(Water heater) పెట్టడంతో అది పేలి బిల్డింగ్ లో ఫర్నిచర్ దగ్గదమైన సంఘటన మేడ్చల్(Medical) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని సోమారం మున్సిపల్(Somaram Municipal) పట్టణంలో వాటర్ హీటర్ పెట్టిన వ్యక్తి బయటకు వెళ్లిన కొద్ది సేపటికే మంటలు చెలరేగి క్షణాల్లో ఇల్లంతా మంటలు వ్యాపించాయి.
మంటలు వ్యాపించిన భవనంలో సుమారు 5 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు బల్గూరి మహేష్ తెలిపారు.ఈ నేపథ్యంలో వాటర్ హీటర్ పేలిన భవనంలో రెండున్నర క్వింటాళ్ల బియ్యంతో పాటు దుస్తులు,నిత్యావసర వస్తువులు,గృహోపకరణాలు కాలి బుద్ధుడయ్యాయి.మంటలు చెలరేగిన సమయంలో ఇంట్లో ఎవ్వరు లేకపోవడం ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు వెల్లడించారు.