రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..

21-09-2026 | 06:07pm

ఉట్నూర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం(Indravelli Mandal)లోని ముత్నూర్ గ్రామానికి చెందిన గంటల్ వార్ గణేష్(41) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై వైద్యం పొందుతూ మృతిచెందారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణేష్ వృత్తిరీత్యా ఆటో నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ కోసం బయటకు వచ్చాడు. ఆదిలాబాద్ నుండి  జన్నారం వైపు వేగంగా వెళ్తున్న కారు ముత్తు గ్రామంలో గణేష్ ని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన గణేష్ ను రిమ్స్ తరలించారు. రిమ్స్ లో వైద్యం పొందుతూ మృతిచెందారు. గణేష్ మృతితో  గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గణేష్ కొడుకు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

మరిన్ని వార్తలు