డిఆర్ఎఫ్ సిబ్బందికి రక్షణ కిట్లు
కమీషనర్ ప్రఫుల్ దేశాయ్
ముకరంపుర,(విజయక్రాంతి): విపత్తులతో పాటు ఇతర సమయాల్లో నగర ప్రజల రక్షణ కల్పిస్తూ...మెరుగైన సేవలందించాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం 23 మంది డీఆర్ఎఫ్ బృంధాల సిబ్బందికి కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తన చేతుల మీదుగా రక్షణ కిట్లను పంపిణీ చేశారు. గతంలో నగరంలోని స్పోర్ట్స్ స్కూల్ లో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్మెంట్" శాఖ వారి ఆద్వర్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన 23 మంది డీఆర్ఎఫ్ సిబ్బందికి వారం రోజుల పాటు శిక్షణ తరగతులు జరిగాయి.
ఈ నేపథ్యంలో శిక్షణ తరగతులు పూర్తి చేసి విపత్తు నిర్వహణ మెలకువలు నేర్చుకున్న సిబ్బందికి జీహెచ్ఎంసీ ఈవీ&డీఎం డైరెక్టర్ నుండి సంబంధిత రక్షణ కిట్ల బ్యాగులు, శిక్షణ సర్టిఫికెట్లను నగరపాలక సంస్థకు జారీ చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న డీఆర్ఎఫ్ సిబ్బందికి కమీషనర్ కిట్లను అందించి...విధుల్లో వినియోగించాలని సూచించారు.
ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... శిక్షణలో పొందిన జ్ఞానాన్ని, నేర్చుకున్న మెలకువలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వినియోగించి...నగర ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బండారి లక్ష్మణ్, బాబు, తిరుమలై, ఈ బాబు, మధుకర్, ప్రణయ్, వీర్ల లక్ష్మీనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.