విబిజి రామ్ పథకంలో పనులను ఎంపిక చేసుకోండి: ఎంపీడీవో

02-10-2026 | 05:35pm

బోథ్ అక్టోబర్ 2 (విజయక్రాంతి): ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పనకు విభజిరామ్ పథకంలో పనులకు ప్రాధాన్యత ఇస్తుందని పథకంలో పనులను గుర్తించి చేపట్టాలని ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) కోరారు. సోనాల మండలంలోని పార్టీకే గ్రామంలో సర్పంచ్ వినోద్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట ప్రాధాన్యత ఉన్న పనులను గుర్తించి చేపట్టాలన్నారు. అత్యవసరమైన చోట పనులను చేపట్టి వసతులను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కళ్యాణ్ చక్రవర్తితో పాటు అంగన్వాడి ఆశ కార్యకర్తలు గ్రామస్తులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు