అంజన్న భక్తులకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్
04-09-2026 | 09:36pm
కొండగట్టు అంజన్న ఆలయం గుట్టపైన నూతన మొబైల్ టవర్ ప్రారంభం
కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం(Kondagattu Anjanna temple) గుట్ట పైన ఇండస్ టవర్స్ సంస్థ వారిచే ఏర్పాటు చేయబడిన నూతన మొబైల్ టవర్‌ను శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipally Sathyam) ప్రారంభించారు. ఈ మొబైల్ టవర్ అందుబాటులోకి రావడం ద్వారా దేవస్థానమునకు విచ్చేసే భక్తులకు,స్థానిక ప్రజలకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్, కమ్యూనికేషన్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి, దేవస్థాన సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.






