అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు
సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు డిమాండ్
ములకలపల్లి,(విజయక్రాంతి): ఆశా వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(Telangana ASHA Workers Union) జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ ధనలక్ష్మి,సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు(CITU Mandal Convener Nimmala Madhu) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలపై హైద్రాబాద్ లో జరుగుతున్న ధర్నా కు వెళ్ళాకుండా ఆశా వర్కర్లలను అర్ధరాత్రి నుంచి పోలీసులు అరెస్టులు చేసిన ఆశా వర్కర్లలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ములకలపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా నిమ్మల మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.అరెస్టు చేసిన ఆశా వర్కర్లను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ప్రభుత్వం పై ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కురం నాగలక్ష్మి, రోషమ్మ, కళ్యాణీ,సంధ్యా,శ్యామల,శాంతి,కుమారి, పార్వతీ, జ్యోతి,లవ కుమారి, వెంకట రమణ, పద్మ,యేసు మణి,పావని,మేరీ, మాణిక్యమ్మ, ఈశ్వరి,పద్మ, అన్నపూర్ణ,జయ లక్ష్మి, నాగమణి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.