విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

09-09-2026 | 01:12am

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పోచారం గ్రామం(Pocharam village)లోని ఎంపీయుపిఎస్ ప్రాథమిక పాఠశాల(MPUPS Primary School)లో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నీరుడి సంజీవరావు పాల్గొని విద్యార్థులకు ఏకరూప దుస్తులను సర్పంచ్ సంజీవరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంజీవరావు మాట్లాడుతూ... విద్యార్థుల్లో(students) సమానత్వ భావనను పెంపొందించడంతో పాటు పాఠశాలపై మరింత ఆసక్తి,క్రమశిక్షణ కలిగించే విధంగా ఏకరూప దుస్తులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి గ్రామం తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు చదువులో ముందుండి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు