న్యాయశాస్త్రంలో రంగు మౌనికకు డాక్టరేట్

09-09-2026 | 01:03am

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని గంగిపల్లి  గ్రామానికి చెందిన పూసాల శరత్ సతీమణి రంగు మౌనిక న్యాయశాస్త్రం(Jurisprudence )లో పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం(Osmania University) 85వ స్నాతకోత్సవంలో భాగంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla) చేతుల మీదుగా ఆమె ఈ డాక్టరేట్ అందుకున్నారు. 2015లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన మౌనిక, 2016లో నల్సార్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాల సీనియర్ ప్రొఫెసర్ జి.బి. రెడ్డి పర్యవేక్షణలో "బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇన్ హైదరాబాద్ సిటీ: ఎ లీగల్ స్టడీ" అనే అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనా పత్రానికి విశ్వవిద్యాలయం పీహెచ్‌డీని ప్రదానం చేసింది. న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ సాధించడం పట్ల రంగు మౌనికను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజల తో పాటు గంగిపల్లి సర్పంచ్ వాల ప్రదీప్ రావు, మాజీ ఎంపీటీసీ రంగు భాస్కరాచారి పూసాల శరత్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆమెను ప్రత్యేకంగా  అభినందించారు.

మరిన్ని వార్తలు