రసాయనాల అధిక వినియోగంపై అవగాహన నాటిక

11-10-2026 | 05:42pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో(Morampalli Banjara Village) అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల(Agricultural College) గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమ విద్యార్థులు, కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో రసాయనాల అధిక వినియోగం, నేల ఆరోగ్యం, ఆహార భద్రతపై(Food Security) అవగాహన నాటిక ప్రదర్శించారు.

40 మంది సభ్యుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పురుగుమందుల సురక్షిత వినియోగం, నేల పరీక్షలు, సమగ్ర సస్యరక్షణ, సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. నాటికలో నవదీప్‌ వైద్యుడిగా, హరీష్‌ రైతుగా, అరుణ్‌కుమార్‌ వ్యవసాయ విస్తరణ అధికారిగా, శరత్‌ విక్రేతగా, అరవింద్‌ రైతు బిడ్డగా నటించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక రైతు గాదె నర్సిరెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు